కొడుకు తనకిష్టమైన మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంటే "అదేమైనా కూడుపెడుతుందారా శంకరశాస్త్రి! పాటలు నేర్చుకొని బస్టాండ్ ల్లో , రైల్లో అడుక్కు తింటావా ?" అని కొడుకును చిన్నబుచ్చిన తండ్రి!
బాల్యంలో తాను పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని వారు కోరిందే తడవుగా అన్ని కొనిచ్చి గారాబం చేసే కోటీశ్వరుడైన తండ్రి! పరువు, ప్రతిష్ట , స్టేటస్, ముఖ్యమని వీటికోసం ఢాంబికాల్ని ప్రదర్శిస్తూ, నిరాడంబరత, వినమ్రత, సహానుభూతి, శ్రమించే తత్త్వం ఇలాంటి విలువల్ని పిల్లలకు దూరం చేసిన తండ్రి!