blog images

అవకాశమే శాపం అయ్యింది . opportunity క్రైసిస్ గా మారింది.

ఇదో deadly combo !

మలేషియా , సింగపూర్ అందనంత దూరం వెళ్లిపోయాయి . ఇరవై ఏళ్లలో చైనా ఆకాశం ఎత్తుకు ఎదిగి పొయ్యింది . చివరాఖరికి థాయిలాండ్, వియత్నాం, బాంగ్లాదేశ్ లు కూడా మనకంటే ఎక్కువ ప్రగతిని సాధిస్తున్నాయి . మొన్నటిదాకా బాంబు ల తో కొంప కొలంబో అయినా. శ్రీలంక మనకంటే ఎత్తుకు ఎగిసిపోయింది . ఇదేంటి గురూ ? మనం లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలకంటే ఘోరంగా అయిపోతున్నామా ?

విద్య, ఉపాధి , ప్రణాళికలు , నీతి ఆయోగ్ , మేధావులు , చర్చలు ... అసలు సమస్య ను గుర్తించగలిగాయా ? కూడికలు, తీసివేతలు , గణాంకాలు కాదు బాస్ .. చుట్టూరా ఏమి జరుగుతుందో చూడు .. లేక పొతే ఏనుగు ఏడు గుడ్డివాళ్ళ కథే !

దేశ జనాభాలో సగం మంది 25 వయసు లోపు వారే . ముగ్గురిలో ఇద్దరు 35 లోపు వారే ! ఇంతకంటే యంగ్ ఎనర్జిటిక్ దేశం మరొకటి వుండే అవకాశం ఉందా ? వృద్ధుల దేశం జపాన్ దూసుకొని పోతోంది ! యువకుల దేశం ఇండియా కు ఏమైంది ?

అవకాశమే శాపం అయ్యింది . opportunity క్రైసిస్ గా మారింది.

గత ఇరవై ఏళ్లలో మన యువత లో విపరీతమైన ద్వేషభావం పెరిగింది . కులం , మతం , ప్రాంతం , భాష - రూపం ఏమైనా దాని ఎసెన్స్ ఒక్కటే .. ద్వేషం . కక్ష్య , కార్పణ్యం .

ముప్పై ఏళ్ళు లోపు ఉన్న వారిలో వార్తాపత్రికలు చదివే వారు చాలా స్వల్పం . { సివిల్స్ గ్రూప్స్ లాంటి పోటీ పరీక్షలు కు ప్రిపేర్ అయ్యే వారిని మినహాయిస్తే } . టెక్స్ట్ పుస్తకాలూ , జనరల్ పుస్తకాలూ చదవడం బాగా తగ్గిపోయింది . వీరు సమాచారం కోసం సోషల్ మీడియా పై ఆధార పడుతారు. ఏ మెసేజ్ వచ్చినా క్రాస్ చెక్ చేసుకోకుండా గుడ్డిగా ఫార్వర్డ్ చెయ్యడం సహజంగా మారిపోయింది .

ఎన్నికల్లో యూత్ ఓట్లే కీలకం . దీన్ని పసికట్టిన పార్టీ లు పైడ్ ఆర్టిస్ట్ ల ను రంగం లోకి దించాయి . ఒక్కో పార్టీ కి కోట్ల బడ్జెట్ తో సోషల్ మీడియా సెల్స్ . ఒక వార్త పత్రిక ఒక టీవీ ఛానల్ అయితే కనీసం అడ్రెస్స్ ఉంటుంది . తప్పు రాస్తే / చూపిస్తే పరువు / క్రెయిబిలిటీ పోతుంది .. కోర్ట్ కేసు లు ఎదుర్కొనాల్సి వస్తుంది అనే భయం ఉంటుంది . పేరు వూరు లేని అనామక సోషల్ మీడియా రచయితలకు అలాంటి భయాలు ఏమీ వుండవు . విపరీతమైన కుల, మత , ప్రాంతీయ తత్వాలను రెచ్చ గొడుతూ పోస్ట్ లు సృష్టిస్తున్నారు .. అసలే మన యూత్ .. violent వీడియోస్ .. క్రైమ్ సీరియల్స్ చూసి హేట్ భావనను నరనరాల్లో ఎక్కించుకున్న తరం . ఇలాంటి హేట్ పోస్ట్ లు వైరల్ అయిపోతాయి . ఎవరు ఎంత ఎక్కువ హాట్రేడ్ ను స్ప్రెడ్ చేస్తే వారిదే విజయం .

విషయం పైన అవగాహన ఉండదు .. ఏది మంచి? ఏది చెడు? అనే అవగాహన ఉండదు .. గుంపులో గోవిందా .. గొర్రె దాటు వ్యవహారం .. అభివృద్ధి మరుగున పడింది .. హేట్ బేస్డ్ రాజకీయాలు సార్వజనీనం అయ్యాయి . టీవీ చర్చ ల్లో ప్రధాన అంశం అదే .. డైలీ సీరియల్స్ లో అదే .. సోషల్ మీడియా లో అదే .. ద్వేషం .. ద్వేషం .. దేశం .. రాష్ట్రాలు .. పట్టణాలు.. పల్లెలు .. వాడలు.. వీధులు .. ఇళ్ళు .. ద్వేష భావన తో రగిలి పోతున్నాయి .

దేశం లో వాళ్లంతా వేస్ట్ .. కేవలం నా దక్షిణాది వారే గొప్ప .. దక్షిణాదిలో కూడా మిగతా రాష్ట్రాలు మంచివి కావు .. నా రాష్ట్రమే గొప్ప .. రాష్ట్రం లో కూడా మిగతా ప్రాంతాలు గొప్పవి కావు .. మా ప్రాంతమే గొప్ప .. మా జిల్లా నే గొప్ప .. అందులో మా మండలమే గొప్ప .. అందులో మిగతా గ్రామాలన్నీ వేస్ట్ .. మా వూరే గొప్ప .. మా వూళ్ళో అందరు వేస్ట్ .. మా ఇల్లే గొప్పే .. మా ఇంట్లో అందరు వేస్ట్ .. నేనే గొప్ప ... ఇది ఆలోచన క్రమం .. మరో కోణం లో మా కులమే గొప్ప .. మా మతమే గొప్ప .. ఇలా అవతలి మనిషి ని ద్వేషించడానికి ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు .. విశాల దృక్పధం గురించి ఎవరైనా మాట్లాడితే వారు చేతకాని దద్దమ్మలు .. అవగాహన లేని ఫూల్స్ అయిపోతారు . ఎవడెంత రెచ్చగొడిదే వాడే లీడర్ .. ఏ ఛానల్ ఎంత సెన్సేషన్ చెయ్యగలిగితే దానిదే రేటింగ్స్ .. రామ్ పాగల్ వర్మ లు .. మెంటల్ కృష్ణ లు .. అర్జున్ రెడ్డి లు నేటి ఐకాన్స్ ..

ఎంత మంచి టీచర్ / లెక్చరర్ అయితే ఏంటి సర్? .. అసలు విద్యార్ధి క్లాస్ లో కూర్చొని పాఠం వింటే కదా ? రాత్రి స్మార్ట్ ఫోన్ లో చూసిన నీలి చిత్రం పోర్న్ స్టార్ తో లేడీ టీచర్ ను తోటి అమ్మాయి ని పోల్చుకొంటూ ఆలోచనల్లో మునిగి తేలుతుంటే ? ఆ అమ్మాయి ని ఎలా పడెయ్యాలి .. లవ్ లో పడిన అమ్మాయి తో ఎలా సెక్స్ చెయ్యాలి .. సెక్స్ చేసిన అమ్మాయి ని ఎలా వదిలించుకోవాలి .. అమ్మాయి విషయం లో తనకు అడ్డుగా దిగిన మరొకడ్ని ఎలా లేపెయ్యాలి ? సాయంకాలం పబ్ లో డ్రింక్స్ కోసం ఇంట్లో ఎలా డబ్బు కొట్టేయాలి .. గంజాయి కోసం డ్రగ్స్ కోసం చైన్ స్నాచ్యింగ్ ఎలా చెయ్యాలి .. రాగ్గింగ్ పేరుతొ అబ్బాయి తో ఎలా సుడోమి సాగించాలి .. ఇదీ మన లోకం ..

ఏంటి అబ్బాయిలనే అంటున్నాను అనుకొంటున్నారా ? అమ్మాయిలు కాస్త వెనుక వున్నా ఇటీవలి కాలం లో మంచి ప్రగతి సాధిస్తున్నారు లెండి .. జెండర్ ఈక్వాలిటీ సాకారం అయిపోతోంది . పబ్ లో మొగుడు ముందు .. మొగుడు ఎక్కడైనా చావనియ్యండి .. పసి పిల్లలైన కొడుకు కూతురు మందు కొట్టి .. సిగరెట్ దమ్ము కొట్టి... పొట్టి బట్టల్లో డాన్స్ చేస్తూ న్యూ ఇయర్ కు welcome పలికే యంగ్ MOMS .. ఇంటర్ లో చేరక ముందే డ్రగ్స్ కు.. ఫ్రీ సెక్స్ కు.. అలవాటు పడ్డ అమ్మాయిలు .. కర్చీఫ్ ను మార్చినట్టు బాయ్ ఫ్రెండ్స్ మార్చేసే అమ్మాయిలు .. అసలు మన పాత్రికేయులు ఈ లోకం లేరు లెండి .. అందుకే వారికి ఇలాంటి విషయాలు పెద్దగా తెలియవు .. ఇటీవల బాగా పెరుగుతున్న లెస్బియనిజం .. వద్దు... ఇంకా చెబితే ఏదో సెన్సేషన్ కోసం రాసిన చెత్త పోస్ట్ అయిపోతుంది .

ఇదండీ మన యువత లోకం .. అందరూ ఇలాగె వున్నారా? అంటే .. కాదు .. కానీ అత్యధికం ఇదే దారి . ఇక విద్య ఉపాధి .. అభివృద్ధి .. మట్టీ మశానం .. ఎలా సాధ్యం ?

దేశం జనాభాలో సగం మంది యువత .. ఆ యువత చేతిలో సెల్ ఫోన్ .. సోషల్ మీడియా .. రాజకీయ పార్టీ ల ఓట్ల రాజకీయం .. ఇది DEADLY కంబో గురూ ..

ఎవరో రావాలి.. ఈ తీగెలు సవరించాలి ... ప్రస్తుతానికి ఈ వీణకు శృతి లేదు .. ఈ నా పోస్ట్ ఎందుకో చాలామందికి అర్థం కాదు .. ఎవరో రావాలి ..