blog images

స్కూల్ లో టీచర్స్ ను .. స్నేహితులను .. తల్లితండ్రులను చంపుతున్న పిలల్లు . ఇది ఎలా జరుగుతోంది . టీనేజ్ లోనే పిలల్ల మనస్సు ఇంత విష పూరితం ఎందుకు అవుతోంది ?

ఆయనో లారీ డ్రైవర్ . ఒక్కటే కూతురు . దంపతులిద్దరూ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచారు . ఉన్నత చదువుల చదివించి అమెరికా లో స్థిరపడేలే చూడాలని కలలు కన్నారు . ఆ అమ్మాయి ఇంకా డిగ్రీ రెండవ సంవత్సరం లోనే వుంది . ఇది వరకే ఒక అబ్బాయి తో ప్రేమ వ్యవహారం నడిపింది . దాంతో గొడవలు అయ్యాయి . ఇప్పుడు మరో అబ్బాయి తో వ్యవహారం . వద్దనందుకు తల్లిని చున్నీతో వురి తీసి చంపి శవం ఇంట్లో ఉండగానే ప్రియుడి తో మూడు రోజులు గడిపింది . తరువాత కార్ లో తీసుకొని రైల్ పట్టాల పై పడుకోబెట్టింది . అందరినీ మభ్య పెట్టింది . చివరకు తండ్రిని బలి పశువు చెయ్యాలని చూసింది . కూతురుని అల్లారు ముద్దుగా పెంచినందుకు తల్లి దిక్కు లేని చావు చచ్చింది . కనీసం శవం కూడా సరైన దహన సంస్కారానికి నోచు కోలేదు . ఇక తండ్రి బతికినన్నాళ్లు జీవచ్ఛవమే . ఇక ఆ క్రిమినల్ అమ్మాయి కి ముందుగా అండర్ ట్రయిల్ గా అటు పై ఖైదీ గా కనీసం పదేళ్లు జైలు జీవితం . అంటే మొత్తం ఒక కుటుంబం నాశనం .

ఇదేదో ఎక్కడో ఎప్పుడో జరిగితే ఏమోలే అనుకోవచ్చు . కానీ వారానికి రెండు చొప్పున ఇలాంటి క్రైమ్ స్టోరీస్ . మొన్నటికి మొన్న పబ్ జీ గేమ్ ఆడొద్దన్నందుకు తండ్రి ని చంపిన కొడుకు . స్కూల్ లో టీచర్స్ ను .. స్నేహితులను .. తల్లితండ్రులను చంపుతున్న పిలల్లు . ఇది ఎలా జరుగుతోంది . టీనేజ్ లోనే పిలల్ల మనస్సు ఇంత విష పూరితం ఎందుకు అవుతోంది ?

చందమామ , బాల మిత్ర మ్యాగజైన్స్ , సత్య హరిశ్చంద్ర , రామాయణ మహాభారత కథలు - ఇలా మొన్నటి దాక వినోదం అంటే నైతిక సూత్రాల లైఫ్ స్కిల్స్ పాఠాలు. ఇప్పుడు వినోదం అంటే మనస్సులోకి విషం ఎక్కించడమే . వీడియో గేమ్స్ , క్రైమ్ సీరియల్స్ , చెత్త సినిమా లు నెట్ ఫ్లిక్ , యూట్యూబ్ షార్ట్ మూవీస్ - నేను ఇది వరకే చెప్పాను.. తల్లితండ్రికి తెలియకుండా ప్రతి ఇంట్లో ఒక టెర్రరిస్ట్ తయారవుతున్నాడు అని . అవుతున్నాడు అంటే అబ్బాయిలకు వర్తిస్తుంది . నాది వాక్య నిర్మాణ దోషం . తయారవుతున్నారు అని చెప్పి ఉండాల్సింది . హైదరాబాద్ లో రాత్రి పది గంటల తరువాత ఏదైనా పబ్ లోకి అడుగుపెడితే అర్థం అవుతుంది . చెడును ఒంటపట్టించుకోవడం లో అమ్మాయిలు అబ్బాయిలను ఓవర్ టేక్ చేస్తూ మిగతా విషయాల్లో ఎలా వున్నా ఇలాంటి విషయాల్లో లింగ భేదాన్ని ఎలా చెరిపేస్తున్నారో

దీనికోసం వారిని వీరిని నిందించి ప్రయోజనం లేదు . ప్రభుత్వాలు , సంస్థలు ఏమీ చెయ్యవు . ఇది ఒక సమస్య అని వారికి అనిపించదు కూడా . టీవీ ల కు రాజకీయ రచ్చ తప్పించి ఇంకేమి పట్టదు సమస్య కు పరిష్కారం తల్లితండ్రి చేతిలో నే వుంది . మీ పిల్లల్ని స్మార్ట్ ఫోన్ కు దూరం చెయ్యండి . టీవీ , ఇంటర్ నెట్ పై వారు ఏమి చూస్తున్నారో ఒక కంట కనిపెట్టి వుండండి . మంచి పుస్తకాలను వారిచే చదివించండి . వారితో క్వాలిటీ టైం గడపండి . వారితో స్నేహితుల్లా ఉంటే వారు మీ చెయ్యి దాటిపోకుండా వుంటారు . పిల్లల పై ఆశలు పెంచుకోవడం ప్రతి తల్లితండ్రి చేసే పనే . వారు లక్ష సాధన వైపు సాగిపోయ్యేందుకు వారికీ మంచి మార్గం చూపే పని కేవలం అవగాహన కలిగిన matured పేరెంట్స్ మాత్రమే చెయ్యగలరు . పేరెంటింగ్ ఈజ్ యాన్ ఆర్ట్ .. పేరెంటింగ్ ఈజ్ ఏ సైన్స్ ...